భవన నిర్మాణ కార్మికులకు అండగా మంత్రి.. సంక్షేమంపై హామీ

by srinivas |
భవన నిర్మాణ కార్మికులకు అండగా మంత్రి.. సంక్షేమంపై హామీ
X

దిశ ఏపీ బ్యూరో, అమరావతి: వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని, జగన్ ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం దారి మళ్లించిన ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తెచ్చామని పేర్కొన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని, టిడిపి హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed