చీరాల సమీపంలో ఘోరం... కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య

by srinivas |
చీరాల సమీపంలో ఘోరం... కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడి దారుణ హత్య
X

దిశ ప్రతినిధి, చీరాల: కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం-ఆదినారాయణపురం మధ్య జరిగింది. మనోజ్, సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ స్నేహితులు. మనోజ్ బైక్ పై, ఆరిఫ్ సైకిల్‌పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వెళ్తున్నారు. వెనుక నుంచి వస్తున్న ఓ గుర్తు తెలియని పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వెళ్తుంది. అందులో ఐదుగురు యువకులున్నారు. వాళ్ల కారుకు సైడ్ ఇవ్వలేదని ఆరిఫ్‌తో కారు‌లో ఉన్న వారు ఘర్షణకు దిగారు.వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్‌పై విచక్షణారహితంగా పొట్ట,మెడ, గుండెలపై పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్‌ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు. మృతుడి తండ్రి చీరాలలో ఓ వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

అన్ని అనుమానాలే...

ఇది కిరాయి హత్య అన్న అనుమానాలు కూడా పలువురిలో తలెత్తాయి. సం ఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ సోమశేఖర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చీరాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హత్య జరగడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఏమైనా బాపట్ల జిల్లా చీరాల నేరాలకు కేరాఫ్‌గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే వరుస హత్యాలతో చీరాల-ఈపురుపాలెం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు

Advertisement

Next Story