- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఎన్నికల హామీలు ఇవే...!
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.౧౫౦౦ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ చేపట్టిన ‘రా..కదిలిరా’లో భాగంగా శుక్రవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం కింద రూ. 5 వేలిస్తామన్నారు.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిత్యావసర ధరలు తగ్గిస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే రైతులకు అన్నదాత పథకం కింద ఏడాదికి రూ.20 వేలిస్తామని, మైక్రో ఇరిగేషన్ తెచ్చి రైతులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. యువత ఈ 100 రోజులు కష్టపడాలని, సైకిలెక్కి టీడీపీ జెండా పెట్టుకోండని.. తమకు దారి చూపిస్తామని చెప్పారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, డీఎస్సీ ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, సురక్షిత మంచినీరు అందిజేస్తామన్నారు. జగన్ రెడ్డి వెలుగొండ కాంట్రాక్టర్లను మార్చాడు గానీ, ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. వెలిగొండ పనులను తానే ప్రారంభించామని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తామని హామీచ్చారు. టీడీపీకి బీసీలు వెన్నెముక..వారి రుణం తీర్చుకుంటానని, బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహిస్తామన్నారు. ఎస్సీలకు 30 సంక్షేమ పథకాలు రద్దు చేశారని, ఎస్సీ యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీని జైలు నుంచే ఊరేగింపుగా తీసుకెళ్తారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆదుకునే బాధ్యత తనదన్నారు. వైసీపీ పాలనలో సర్పంచులకు వాలంటీర్‌కి ఉండే గౌరవం కూడా లేదన్నారు. నిధులు, విధులు లేవని, స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటేనే ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. నిధుల్లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, సర్పంచుల గౌరవం పెంచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు.