- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్కాపురం రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఈ క్రమంలో లిఫ్ట్ ఎక్కి అందులో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. అలా లిఫ్టులో ఉన్న 14 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది.
అంతేకాదు తలుపులు గట్టిగా మూసుకుపోయాయి. దీంతో లిఫ్టులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయాణికులు 3 గంటల పాటు నానా తంటాలు పడ్డారు. చివరికి వారి అరుపులు, కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. ఆదివారం కావడంతో టెక్నీషియన్లు లేరు. ఈ మేరకు స్వయంగా వారే తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Next Story