- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Posani: కర్నూలు To విజయవాడ.. పీటీ వారెంట్‌పై పోసాని తరలింపు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)ని తాజాగా విజయవాడ (Vijayawada)లోని భవానీపురం (Bhavanipuram) పీఎస్‌కు తరలించారు. అయితే, పీటీ వారెంట్ (PT Warrant)పై కర్నూలు (Kurnool) జిల్లా జైలు నుంచి ఆయనను విజయవాడ (Vijayawada)కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తే పోసానిని పోలీసులు విజయవాడ జైలుకు తీసుకెళ్లనున్నారు. కాగా, పోసానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court)లో స్వల్ప ఊరట లభించింది.
సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan), మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియా (Social Media)లో అసభ్యకర పోస్టుల ఆరోపణ నేపథ్యంలో నాలుగు పోలీస్ స్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ.. పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మంగళవారం ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖ (Vishakha)తో పాటు చిత్తూరు (Chittoor) జిల్లాల్లో నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.