Breaking: మోహన్‌బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్

by srinivas |   ( Updated:2024-12-11 12:45:37.0  )
Breaking: మోహన్‌బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీ వివాదంలో మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్‌పల్లి మోహన్ బాబు హౌస్(Jalpally Mohan Babu House) వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి మంచు మనోజ్(Manchu Manoj) ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఒకరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన కారకులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మోహన్ బాబు ఇంటి వద్ద మాయమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కాగా మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా తారా స్థాయికి చేరాయి. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మనోజ్ మధ్య వివాదం మంగళవారం రాత్రి ఉద్రిక్తంగా మారింది. మోహన్‌బాబు ఇంటికి తన భార్యతో కలిసి మంచు మనోజ్ వెళ్లారు. అక్కడ మనోజ్, మోహన్‌బాబు ఇంటి బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో మనోజ్‌కు గాయాలయ్యాయి. దీంతో తనపై మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్(Mohan Babu Manager Venkata Kiran) దాడి చేశారని పహాడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే మనోజ్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి వెంకట కిరణ్ పరారీలో ఉండటంతో గాలించి అరెస్ట్ చేశారు.


Also Read..

Manchu Lakshmi: ఫ్యామిలీ గొడ‌వ‌లతో.. మంచు ల‌క్ష్మీకి సంబంధం లేదా..? ఇలాంటి పోస్ట్ పెట్టేందేంటని మండిప‌డుతున్న ...

Advertisement

Next Story