రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం.. ఆందోళనలో ప్రజలు

by Jakkula Mamatha |
రాష్ట్రంలో వింత వ్యాధి కలకలం.. ఆందోళనలో ప్రజలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధి కాక్సీకీ అనే వైరస్ ద్వారా నెలల శిశువు నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు అధికంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాధిని ‘హ్యాండ్‌ ఫుట్‌ మౌత్’‌ అనే పేరుతో పిలుస్తారు. ఈ వ్యాధి పిల్లలను తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తోంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లల్లో ఉండే లక్షణాలు చేతులు, కాళ్లు, నోటి మీద పొక్కులు, పుండ్లు, దద్దుర్లు రావడం వంటివి కనిపిస్తాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ వైరస్‌ వ్యాప్తి ప్రజెంట్ అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రభావం ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు కనీసం 4 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. వైద్య చికిత్సలు, కొన్ని జాగ్రత్తాలు పాటిస్తే ఈ వ్యాధి బారిన నుంచి బయటపడొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed