- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ పాలనను భరించే స్థితిలో జనం లేరు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : శిశుపాలుడు వంద తప్పులు చేసనా.. ఆ శ్రీకృష్ణుడు భరించాడని, సీఎం జగన్ తప్పులు చేసినా ఎవ్వరూ ఏమి చేయలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో రా.. కదలిరా సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని అన్నారు. జిల్లా మారినా.. వెంకటగిరి పరిస్థితి ఏ మాత్రం మారలేదని ఆయన ధ్వజమెత్తారు. ఐదేళ్లు గడుస్తున్నా.. యువతకు ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు. వైసీపీ పాలనలలో ఆ పార్టీ నాయకులు అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధానినే లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జగన్ పోవాలి.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తిరుపతి శ్రీనివాసుడి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని, ఆ దేవదేవుడి సమక్షంలో ఆపచారాలు చేస్తే.. క్షమించడని హితవు పలికారు. ప్రజలు ఇక ఈ పాలనను భరించే స్థితిలో లేరని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ప్రతీ శాఖలో జరిగిన అవినీతిపై పారదర్శకంగా విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. దొంగ ఓట్లతో మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఓటు అనే వజ్రాయుధంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిందని, ఓటమి భయంతో జగన్ గుండెల్లో వణుకుమొదలైందని చంద్రబాబు అన్నారు.
Read More..