నాగబాబు పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-03-14 14:00:13.0  )
నాగబాబు పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమిని ఏర్పాటు చేయడం కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని అన్నారు. పెద్ద మనసుతో పొత్తులకు వెళ్తే తాను కూడా సీటు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

అంతేకాదు.. ఈ పొత్తు వల్ల సోదరుడు నాగబాబు కూడా సీటు వదులుకున్నారని వెల్లడించారు. బీజేపీ సీట్లు కోరుకోవడం వల్ల జనసేన కొన్ని సీట్లు వదులుకున్నదని చెప్పారు. కాగా, ఈ సారి పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. ఎంపీగా పోటీ చేయటం పైన కూటమి పెద్దలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని అన్నారు.

Read More..

అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా.. జనసేన ఆవిర్భావంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed