Pavan Kalyan : కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ దంపతులు

by M.Rajitha |
Pavan Kalyan : కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా(PrayagRaj Mahakumbhmela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న ప్రారంభం అయిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ కుంభమేళాకు ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సామాన్యులే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు. వీరిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupdi Murmu), ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులే కాకుండా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ(Mukhesh Ambani) వంటి వారు కూడా కుంభమేళా పాల్గొన్నారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. పవన్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తో కలిసి కలిసి త్రివేణి సంగమంలో పపుణ్యస్నానం ఆచరించారు. అంతకముందు గంగామాత హారతి పూజలో పాల్గొన్న పవన్.. మీడియాతో మాట్లాడుతూ.. మహాకుంభమేళాలో పాల్గొనడం గొప్పవరంగా భావిస్తున్నాను అన్నారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఒకచోట చేరినపుడు చిన్నచిన్న ఘటనలు ఎదురవుతాయని.. వాటిని విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్.

Next Story