ఏపీలో తొలిసారి వారాహి నుంచి Janasena Chief Pawan Kalyan స్పీచ్ ఇదే!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-25 05:45:33.0  )
ఏపీలో తొలిసారి వారాహి నుంచి Janasena Chief Pawan Kalyan స్పీచ్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన ప్రచార వాహనం వారాహికి ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక పూజలు ముగిశాయి. తొలుత జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గగుడి రాజగోపురం వద్ద వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై నుంచి ఏపీలో తొలిసారిగా ప్రసంగించారు. రాక్షసపాలన నుంచి ఏపీని విముక్తి చేయడమే లక్ష్యమన్నారు. అందుకే వారాహి ద్వారా ప్రచారం చేపడుతున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుండాలని పవన్ కాంక్షించారు. ఏపీ సుభిక్షంగా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

పవన్ కల్యాణ్ వారాహి ఓ 'పంది బస్సు'.. RGV ట్వీట్

Advertisement

Next Story