ఆ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. హఠాత్తుగా ఎదురైన ఆకారాన్ని చూసి వణికిపోయిన ప్రయాణికులు!

by Jakkula Mamatha |   ( Updated:2025-01-12 13:21:29.0  )
ఆ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. హఠాత్తుగా ఎదురైన ఆకారాన్ని చూసి వణికిపోయిన ప్రయాణికులు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆ రోడ్డు మార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సు(RTC Bus) డ్రైవర్‌కు షాకింగ్ ఘటన ఎదురైంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎదో ఒక చోట పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(శనివారం) తిరుమల(Tirumala)లో చిరుతను చూసిన టీటీడీ ఉద్యోగి భయపడ్డారు. దీంతో బైక్ అదుపు తప్పి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో చోట చిరుత(Cheetah) సంచారం కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా(Alluri District) గూడెం కొత్తవీధి మండలం లోని దారకొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు తెలిపారు. ఈరోజు(ఆదివారం) ఉదయం ఆర్టీసీ బస్సు డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొంతమంది వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. దారకొండ ఘాటి రహదారిలోని సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద పులి కనబడినట్లు గిరిజనులు పేర్కొన్నారు. ఈ అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని పెద్దపులి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు.

Next Story

Most Viewed