రైల్వే స్టేషన్ లిఫ్టులో ఎక్కిన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by D.Reddy |   ( Updated:2025-02-03 11:43:49.0  )
రైల్వే స్టేషన్ లిఫ్టులో ఎక్కిన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు మెట్లు ఎక్కటం చాలా వరకు మానేశారు. వైద్యులు మెట్లు ఎక్కటం వల్ల ఉపయోగాలు చెప్పిన వినిపించుకోకుండా.. అపార్ట్‌మెంట్లు, మాల్స్, మెట్రో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసిన లిఫ్ట్‌నే (Lift) వాడుతున్నారు. అయితే, తాజాగా రైల్వే స్టేషన్‌లో (Railway Station) కొంతమంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కి.. 3 గంటల పాటు అందులోనే నరకయాతన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని (AP) ప్రకాశం జిల్లాలో (Prakasham District) ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

మార్కాపూరం రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫారమ్ నుంచి మరో ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు. అయితే, పరిమితికి మించి ఎక్కటంతో లిఫ్టు ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. అయితే టెక్నీషియన్లు లేకపోవడంతో వారే స్వయంగా రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. వీరంతా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్కాపురం రైల్వే స్టేషన్‌కు రాగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click Here Tweet..


Next Story

Most Viewed