- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Assembly:రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ నెలలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం మొదటిసారి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీలో నిర్వహించడం జరిగింది. మళ్లీ ప్రజెంట్ రెండోసారి సోమవారం నుంచి పూర్తి స్థాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు గవర్నర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత వైసీపీ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది.