ఏపీకి మరో ముప్పు.. పలు జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ

by srinivas |
ఏపీకి మరో ముప్పు.. పలు జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: వరదలతో ఏపీ (AP) లోని పలు జిల్లాలు విలవిలలాడిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విజయవాడ బుడమేరు వాగు (Vijayawada Budameru Wagu) ఉప్పొంగి ఇళ్లలోకి ప్రవహించింది. దీంతో ప్రాంతాలు జల విలయంలో చిక్కుకున్నాయి. 2.76 లక్షలకు పైగా వరద ప్రభావితులయ్యారు. అయితే ప్రభుత్వం సకాలంలో స్పందించి సహాయ చర్యలు అందిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

అయితే ఏపీకి మరోసారి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపు కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్‌, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed