Fear: కుక్కలే కాదు.. ఇప్పుడు రంగంలోకి కోతులు కూడా..!

by srinivas |   ( Updated:2025-01-18 06:23:34.0  )
Fear: కుక్కలే కాదు.. ఇప్పుడు రంగంలోకి కోతులు కూడా..!
X

దిశ, వెబ్ డెస్క్: కుక్కల(Dogs) స్వైర విహారాన్నే జనం తట్టుకోలేకపోతున్నారంటే.. ఇప్పుడు కోతులు(Monkeys) కూడా రంగంలోకి దిగుతున్నాయి. వీధుల్లో, ఇళ్లపై హల్ చేస్తున్నాయి. చేతికి దొరికినవి ఎత్తుకుపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కుక్కలు, కోతుల దెబ్బకు ఇంటి తలుపులు మూసుకుని బయటకు రావడం లేదు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగింది.

పాయకరావుపేటలో కొంతకాలంగా కోతులు, కుక్కలు విజృంభిస్తున్నాయి. రాజుగారి బీడు, బృందావనం, లింగాలతోట కాలనీ, సాయి నగర్, షీలాసగర్, పెద్దిరెడ్డి నగర్, కంటోన్మెంట్ ఏరియాల్లో కోతులు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నాయి. తలుపులు తీసి ఉంటే ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దొరికిన తినుబండారాలు తీసుకుపోతున్నాయి. ఒంటరిగా ఎవరైనా ఉంటే వారిపై దాడులకు దిగుతున్నాయి. అంతేకాదు రోడ్లపైకి కూడా వెళ్తున్నాయి. వాహనాలకు అడ్డుపడుతున్నాయి. దీంతో కొంతమంది కిందపడి గాయాలపాలయ్యారు. మరికొంతమందిని విచక్షరణా రహితంగా కరిచాయి. దీంతో జనాలు బయటకు రావాలంటేనే బయటపడిపోతున్నారు. అటు కుక్కులతోనే కాకుండా ఇటు కోతులతోనూ ప్రతి రోజూ నరకయాతన అనుభవిస్తున్నామని పాయకరావుపేట జనం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెడద నుంచి తమను తప్పించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed