- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
AP News:టీడీపీ కార్యాలయం పై దాడి కేసు..ఆ ఇద్దరికి నోటీసులు
దిశ,వెబ్‌డెస్క్:టీడీపీ కార్యాలయం(TDP office) పై దాడి కేసులో వైసీపీ నేతలు(YCP Leader) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని దేవినేని అవినాశ్, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలు(YCP MLC) తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, 41 ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు(Supreme Court) ఉత్తర్వుల నేపథ్యంలో వైసీపీ నేతలు తమ పాస్ పోర్టులను మంగళగిరి రూరల్ పీఎస్‌లో అందజేయనున్నారు.