- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడదల రజినీ వద్దు..మద్దాళి గిరి ముద్దు: గుంటూరులో ఆర్యవైశ్యుల నిరసన
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌చార్జిల మార్పు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ 11 మంది నియోజకర్గాల ఇన్‌చార్జిల మార్పులు చేర్పులు చేశారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మద్ధాళి గిరిధర్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దాళి గిరిధర్‌కు వైసీపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. మద్దాలి గిరికి మద్దతుగా ఆర్యవైశ్యుల ఆందోళనకు దిగారు. పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఆర్యవైశ్యుల నిరసన తెలియజేశారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలంటూ నినాదాలు. మంత్రి విడుదల రజనీని ఇన్‍ఛార్జ్ గా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్దాళి గిరికి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆర్యవైశ్యులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇకపోతే మద్దాళి గిరిధర్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అనుబంధంగా మారారు. అయితే తాజాగా వైసీపీలో కూడా టికెట్ దక్కే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే విడదల రజినీని గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారనే ప్రచారం జరుగుతుంది. అటు టీడీపీలో టికెట్ కోల్పోయి.. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా టికెట్ రాకపోవడంతో మద్దాళి గిరి పరిస్థితి ఏటూ కాకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.