కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-05-02 16:21:42.0  )
కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెడ్ డెస్క్: అవినాశ్ చిన్నపిల్లాడైతే బడికి పంపాలని, పార్లమెంట్‌కు పంపిస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. వైఎస్ వివేకా హత్యపై కడప ప్రజాగళం సభలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని చంపింది ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అవినాశ్ రెడ్డిలా అంత అరాచకానికి పాల్పడిన వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్నారు. వివేకాను దారుణంగా చంపి బాధితులనే నిందితులుగా మార్చేశారని మండిపడ్డారు. పొరపాటున కూడా జగన్ కు ఓటు వేయొద్దని, కానీ వేశారంటే ఇంటికి గొడ్డలి వస్తోందని వ్యాఖ్యానించారు. అధికార మదంతో సీఎం జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. నేరాలు, ఘోరాలు చేయడంతో జగన్‌ పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. అధికారాన్ని ఉపయోగించి అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. దుర్మార్గులకు ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అనే మాట వినపకుండా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story