NDA: కేంద్ర బడ్జెట్ పై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు..

by Ramesh Goud |
NDA: కేంద్ర బడ్జెట్ పై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)కి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కేంద్ర బడ్జెట్ (Union Budget) పై వరుస ట్వీట్లు పెడుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్(Union Minister Nirmala Sitharaman) 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్(Parliament) లో ప్రవేశ పెట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న మాజీ ఎంపీ కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ పై తనకు నమ్మకం ఉందని, సాధారణ పౌరుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కూడా బడ్జెట్ సహాయపడుతుందని తెలిపారు.

రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపు లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. అలాగే మరో ట్వీట్ లో అనేక నిత్యావసర వస్తువులపై కస్టమ్ డ్యూటీని తగ్గించడం ద్వారా.. అవి చౌకగా మారాయని, ఇది నేరుగా మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్ ఆర్థిక శ్రేయస్సు, వికసిత్ భారత్ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం (Prime Minister Narendra Modi Government) సాహసోపేతమైన సంస్కరణలకు పర్యాయపదంగా ఉందని, రెగ్యులేటరీ సంస్కరణల కోసం ఉన్నత-స్థాయి కమిటీ మరొక పరివర్తన దశ అని తెలియజేశారు. ఈ క్రమబద్ధీకరణ నిబంధనలు, లైసెన్స్‌లు, అనుసరణలు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని, విశ్వాస ఆధారిత పాలనను బలోపేతం చేస్తాయని విశ్వసించారు.

భారత వ్యాపారవేత్తలు వ్యాపారాలను మెరుగుపరుచుకోవడం కోసం ఈ బడ్జెట్ గేమ్-ఛేంజర్! అని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా.. 2025 బడ్జెట్ 'మధ్యతరగతి బడ్జెట్'గా గుర్తుండిపోతుందని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క రికార్డు వరుసగా 8వ బడ్జెట్ అని, ఈ బడ్జెట్ తో భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఆదాయపు పన్ను మినహాయింపు, తగ్గిన కస్టమ్ డ్యూటీలు, బలమైన ఆర్థిక సంస్కరణలతో, ఈ బడ్జెట్ కష్టపడి పనిచేసే కుటుంబాలను శక్తివంతం చేస్తుందని, దేశం యొక్క అభివృద్ధి పథాన్ని బలోపేతం చేస్తుందని విజయసాయి రెడ్డి రాసుకొచ్చారు. ఈ ట్వీట్లతో రాజకీయాలకు స్వస్తి చెబుతున్నానని రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. బడ్జెట్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.



Next Story