- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెద్దిరెడ్డి కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందే.. మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కూడా జైల్లో (Jail) ఊచలు లెక్కపెట్టాల్సిందేనని మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) స్పష్టం చేశారు. ఓ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నేతల (YSRCP leaders) భూ కబ్జాల (land Grabbing) గురించి సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించనిది ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆయన ఫ్యాక్టరీలు తీసుకొని రమ్మంటే దొంగ ఫ్యాక్టరీలు (Brought Factories) తీసుకొచ్చాడని మండిపడ్డారు.
పెద్దిరెడ్డి కుటుంబం (Peddireddy Family) చేసిన పాపాలపై, ఆయన ఆక్రమణలపై, దేశంలోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సీటీలతో (Prestigious Universities) కేస్ స్టడీ (case study) చేయించాలని అన్నారు. ఇటువంటి మోసాలు, ఘోరాలు, కబ్జాలు, పాపాలు, అరచకాలు ఒక కుటుంబం చేయగలదా అనేది యూనివర్సిటీలతో కేస్ స్టడీ చేయించాలని చెప్పారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేయని పాపాలు, కబ్జాలు లేవని, చివరికి ఎంతకి బరితెగించారంటే వాళ్ల పాపాలు బయటపడతాయని ఎమ్మార్వో ఆఫీసు (MRO office)ను, దానిలో ఉంటే పత్రాలను కూడా కాల్చేశారని అన్నారు. వీటన్నింటిపై విచారణ జరుగుతోందని, ఎవరు కూడా తప్పించుకునే ప్రసక్తే లేదని అన్నారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి అయినా.. మిథున్ రెడ్డి (Mithun Reddy) అయినా, ఇంకా ఎవరైనా దోషులుగా తేలితే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. పాపాలు చేసిన వారు ఎవరైనా జైళ్లో ఊచలు లెక్కపెట్టాల్సిందేనని, వాళ్ల నాయకుడు జగన్ మోహన్ రెడ్డే (Jagan Mohan Reddy) పెట్టారు.. వీళ్లైనా పెట్టాల్సిందేనని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. కాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం (YSRCP government) హయాంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో జరిగిన భూకబ్జాలపై కమిటీలు వేసి, విచారణ చేపడుతున్నారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.