- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు... కదలుతోన్న డొంక..!
దిశ, వెబ్ డెస్క్: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి(Former AU VC Prasad Reddy)కి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ(Ycp Government)హయాంలో ఆయన ఏయూ వీసీగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై విశాఖపట్నం(Visakhapatnam) టీడీపీ(Tdp), జనసేన (Janasena), బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల చిట్టాను బయటకు తీశారు. లిస్టు రెడీ చేసి మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)కు అందజేశారు. ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టాలని కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు.
పవిత్రమైన సరస్వతి నిలయాన్ని జగన్ హాయంలో రాజకీయాలతో భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థకు రాజకీయ రంగుపులుమారని కూటమి నాయకులు ఆరోపించారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చారని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య చాలా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) నిధులను మళ్లించారని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. విచారణలో ప్రసాద్ రెడ్డి అవినీతి డొంక కదులుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు.