- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరుణించు స్వామి: అన్నవరంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నవరం సత్యన్నారాయణ స్వామిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరంలోని లోకేశ్ క్యాంపు కార్యాలయం నుంచి భువనేశ్వరి సోమవారం ఉదయం అన్నవరం బయలు దేరారు. అనంతరం సత్యనారాయణ స్వామి వారిని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి దర్శించుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో తన భర్త చంద్రబాబు నాయుడు విడుదలయ్యేలా చూడాలని స్వామి వారిని కోరుకున్నారు. అంతేకాదు ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు తీసుకురావాలని భువనేశ్వరి కోరారు. అనంతరం భువనేశ్వరి జగ్గంపేట బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లారు. టీడీపీ నేతలు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు.
Next Story