ప్రజల్లోకి నారా భువనేశ్వరి: ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

by Seetharam |
ప్రజల్లోకి నారా భువనేశ్వరి: ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 25 నుంచి నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి టీడీపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. సీఎం జగన్‌ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతోపాటు...టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై నారా భువనేశ్వరి గళం వినిపించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన 154 కుటుంబాలను నారా భువనేశ్వరి ఓదార్చనున్నారు. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం. అందులోనూ ఈ కార్యక్రమం సొంత జిల్లా నుంచే ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలనికోరుతూ నారా భువనేశ్వరి శ్రీవారి ఆశీస్సులు సైతం తీసుకున్నారు. అనంతరం తిరుమల నుంచి నారా వారిపల్లె వెళ్లారు. అక్కడ కులదైవం నాగాలమ్మకు,గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార రథాన్ని సైతం టీడీపీ సిద్ధం చేసింది. ప్రచార రథంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సొంత జిల్లా నుంచే శ్రీకారం

ఇకపోతే ఈనెల 25న ఉదయం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారా వారిపల్లి నుంచి ‘నిజం గెలవాలి’అనే కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండలం అగరాల సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బహిరంగ వేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలను భువనేశ్వరి ప్రజలకు వివరించనున్నారు. అలాగే వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను భువనేశ్వరి ఎండగట్టనున్నారు. మరోవైపు కుప్పంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై భువనేశ్వరి ప్రజావేదికలపై ఖండించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకు గురై మరణించిన టీడీపీ నేత చిన్న స్వామి నాయుడు కుటుంబంను నేండ్రగుంటకు వెళ్లి నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. అటు తర్వాత ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26వ తేదీన బాధితులను పరామర్శిస్తారని, చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగ సభలో నారా భువనేశ్వరి మాట్లాడుతారని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed