- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ : టీడీపీ అధినేత చంద్రబాబు

దిశ, డైనమిక్ బ్యూరో : నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం దివంగత నందమూరి హరికృష్ణ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు. ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు నాయుడు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయి ఉండాలని గిడగు రామ్మూర్తి ఆకాంక్షించారని గుర్తు చేశారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది టీడీపీయేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.