Nagarjuna Yadav: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

by Shiva |
Nagarjuna Yadav: చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును చంపుతామంటూ మీడియా డిబేట్‌లో ఓపెన్‌గా మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతడు బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పుం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల నాగర్జునను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా అతడు వరుసగా టీబీ డిబెట్లకు హాజరవుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ కల్యాణ్‌‌తో సహా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అయిన టీడీపీ నేతలు నాగార్జున యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కుప్పం పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో ముందస్తు బెయిల్ కోసం నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Next Story