Tulluru: నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదు

by Rani Yarlagadda |
Tulluru: నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh), బోరుగడ్డ అనిల్ పై మరో కేసు నమోదైంది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి అయిన సత్యకుమార్ (Minister Satya Kumar) పై దాడి చేసిన ఘటనలో నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ (Borugadda Anil)పై కేసు నమోదైంది. 2023లో మూడు రాజధానుల శిబిరం వద్ద రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి, తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై 25 మంది బీజేపీ నేతలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ1గా సురేష్ ను, ఏ2 గా బోరుగడ్డ అనిల్ ను చేర్చారు.

నందిగం సురేష్ ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టై.. ఒక కేసులో రిమాండ్ లో ఉన్నారు. టీడీపీ కార్యాలయం పై దాడి, వెలగపూడిలో మహిళ హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీపై తాజాగా మరో హత్యాయత్నం కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ఇక రౌడీషీటర్ గా పేరున్న బోరుగడ్డ అనిల్ 2021లో కర్లపూడి బాబుప్రకాష్ ను రూ.50 లక్షలివ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు.



Next Story