చంద్రబాబుతో ముగిసిన ములాఖత్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-09-14 07:51:06.0  )
చంద్రబాబుతో ముగిసిన ములాఖత్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును నారా లోకేష్, బాలకృష్ణతో కలిసి పవన్ కల్యాణ్ ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో చర్చించారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చివరివరకు కట్టుబడి ఉంటానని చెప్పారు.

సంపూర్ణంగా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. అనవసరంగా రిమాండ్‌లో పెట్డడం బాధాకరమని అన్నారు. 2014లో దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని.. అందుకే మోడీకి మద్దతిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవమున్న వ్యక్తి సీఎం కావాలని అనుకున్నానని అందుకే చంద్రబాబుకు మద్దతిచ్చానని వెల్లడించారు. కొన్ని సార్లు చంద్రబాబు ప్రభుత్వంపైనా విమర్శలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసినప్పుడు ఎవరినైనా ప్రశ్నిస్తానని.. అక్రమంగా అరెస్ట్‌లు చేసినప్పుడు బాధితుల పక్షాన కూడా తప్పకుండా నిలబడుతానని చెప్పారు.

Read More: పొత్తు పొడిచింది: వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తాం: పవన్ కల్యాణ్

Advertisement

Next Story