రాష్ట్రంలో రహదారులకు మహర్దశ

by srinivas |
రాష్ట్రంలో రహదారులకు మహర్దశ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధికి వరుసగా నాలుగో ఏడాదీ కూడా కేంద్రం నుండి రికార్డు స్థాయిలో నిధులను వైసీపీ ప్రభుత్వం సాధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం జగన్ స్పష్టమైన ప్రణాళికతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి నాలుగు ఏళ్ల కాలంలో రూ.23,471.92 కోట్లు కేంద్రం నుంచి నిధులు సాధించగా, టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.10,660 కోట్లు మాత్రమే సాధించిందని చెప్పారు. భూముల రీసర్వే అత్యంత ప్రాధాన్యం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకానికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.


ఇతర రాష్ట్రాలకన్నా మిన్నగా పెద్ద స్థాయిలో భూముల రీసర్వే కార్యక్రమం జరుగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్ చేయని విధంగా భూ హక్కు పత్రాలలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు

Advertisement

Next Story