గల్లా జయదేవ్ నిర్ణయంపై ఎంపీ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-01-28 16:56:51.0  )
గల్లా జయదేవ్ నిర్ణయంపై ఎంపీ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ గుంటూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. అంతేకాదు తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ పోటీ చేయమని తెలిపారు. దీంతో తన సహచరుడు గల్లా జయదేవ్ తీసుకున్న నిర్ణయంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు జీర్ణించుకోలేకపోయారు. జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉందని చెప్పారు. జయదేవ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు భయపడే తనను గల్లా జయదేవ్ ఎంతో ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. గల్లా జయదేవ్ ఈ ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వ్యాపారపరంగా , వ్యక్తిగతంగా సీఎం జగన్‌ వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. పుట్టిన ప్రాంతం కోసం పాటుపడిన కుటుంబం గల్లా జయదేవ్ కుటుంబమన్నారు. జయదేవ్ మళ్లీ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని తాను ఆశిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Advertisement

Next Story