- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MP Raghurama: వివేకా హత్య, కోడి కత్తి సానుభూతితోనే వైసీపీ గెలిచింది

X
దిశ,డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధికోసం, భవిష్యత్ కోసం సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. వందల మంది సలహాదారులను పెట్టుకున్న వైఎస్ జగన్ సొంతంగా ఏం ఆలోచిస్తారని ప్రశ్నించారు. సలహాదారుల సలహాలతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య, కోడికత్తి అంటూ అబద్ధాలు చెప్పి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారని మరి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారోనంటూ సెటైర్లు వేశారు.
Read more:
Next Story