- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:బియ్యం అక్రమ రవాణా పై పవన్ సీరియస్.. స్పందించిన ఎంపీ పురందేశ్వరి
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని కాకినాడ పోర్టును శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice) పై సీరియస్ అయ్యారు. అయితే తాజాగా బియ్యం అక్రమ రవాణా పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(MP Daggubati Purandeshwari) స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు(Kakinada Port)ను కేంద్రంగా చేసుకొని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశం పై తాము గతంలో కూడా ప్రశ్నించామని ఆమె గుర్తించారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో నిల్వలు బయట పడ్డాయన్నారు. ఇవన్నీ కాకినాడ పోర్టు నుంచి నౌకల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారని ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.