Viveka Case: ఆ రోజు ఎవరితో మాట్లాడావ్.. అవినాశ్‌పై ప్రశ్నల వర్షం

by srinivas |
Viveka Case: ఆ రోజు ఎవరితో మాట్లాడావ్.. అవినాశ్‌పై ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. హైదరాబాద్ కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ఆరున్నర గంటల పాటు విచారించారు. అవినాశ్ రెడ్డికి ముందుస్తు బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి వెళ్లిన ఆయనను సాయంత్రం 4.30 గంటల వరకూ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగిందనేదానిపై అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ రోజు అవినాశ్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడాడాన్న దానిపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే అవినాశ్ రెడ్డి చెప్పిన ప్రతి సమాధాన్ని రికార్డు చేశారు. 4.30 గంటలకు విచారణ ముగియడంతో అవినాశ్ రెడ్డి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

Advertisement

Next Story