- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేర్ సీన్.. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోడీ, బాబు, పవన్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీడీపీ-జనసేన-బీజేపీల కూటమి స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో ఈ మూడు పార్టీలు ప్రజా గళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. ఈ సభకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీ.. చిలకలూరిపేట ప్రజాగళం వేదిక సభాప్రాంగణంపైకి చేరుకున్నారు. టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి వేదికపై కూర్చున్నారు. దీంతో పదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి ఒకే వేదికను పంచుకున్నారు. చివరగా ఈ ముగ్గురు 2014లో ఏపీలో ఎన్డీఏ కూటమి విజయోత్స సభలో ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బాబు ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చారు. 2024లో మరోసారి ఈ మూడు పార్టీలు మరోసారి జతకట్టాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి బాబు, మోడీ, పవన్ ఒకే వేదికను పంచుకున్నారు. వైసీపీ ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగింది. దీంతో వైసీపీపై ప్రధాని మోడీ విమర్శల ఎక్కు పెడతారా లేదా అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More..