- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ సీటు ఆశిస్తున్నా.. రాని పక్షంలో కార్యచరణ ప్రకటిస్తా: జంగా కృష్ణమూర్తి
దిశ, వెబ్ డెస్క్: తాను వైసీపీలోనే ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని గురువారం ఉదయం ఆయన కలిశారు. దీంతో జంగా కృష్ణమూర్తి కూడా వైసీపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. వ్యక్తిగత పరిచయం వల్లే తాను పార్థసారథిని కలిశానని చెప్పారు. గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న విషయం వాస్తవమేనని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభిప్రాయం తీసుకున్నాకే గురజాల సీటు ఆశిస్తున్నట్లు జంగా కృష్ణమూర్తి తెలిపారు. పార్టీ మారే ఆలోచన లేదని న, ఎమ్మెల్యే సీటు విషయం సీఎం జగన్‌దే తుది నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలిచానని.. ప్రజల అభిప్రాయం మేరకే మళ్లీ సీటు అడుగుతున్నానని స్పష్టం చేశారు. సీటు రాని పక్షంలో పార్టీ కార్యకర్తలు, నియోజక వర్గ ప్రజల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.