‘పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం’.. ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం’.. ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల వార్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పదహారు మంది ఎంపీలు ఉన్నా.. కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపుల్లేవని అన్నారు. బీహార్(Bihar) లబ్ధి పొందింది కానీ ఏపీకి(Andhra Pradesh) ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు కుదించారని, దీనివల్ల ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై మేధావులతో సమావేశం ఏర్పాటు చేస్తాము. పోలవరం ఎత్తు తగ్గించడం తీవ్ర అభ్యంతరకరం. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని సీఎం చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో బడ్జెట్‌(Budjet)లో రాష్ట్రానికి ఏమి కేటాయిస్తారని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారని బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ వారికి నిరాశే మిగిలిందని విమర్శించారు. మహా కవి గురజాడ పేరును గుర్తుచేసుకోవడం మనందరికీ గర్వకారణం.. కానీ గురజాడ పేరు ప్రస్తావించడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని.. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిరాశ నిస్పృహ కనిపించాయని పేర్కొన్నారు. బడ్జెట్ ద్వారా ప్రత్యేక ప్రయోజనం ఏమి రాష్ట్రానికి కనిపించలేదు. టీడీపీ ప్రయోజనాలు వేరు, రాష్ట్ర అవసరాల వేరు అనేది స్పష్టమైందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రజలకు నష్టం జరిగేలా చర్యలు ఉండకూడదు.. కూటమి పాలన కంటే జగన్ పాలనలో జీడీపీ, వృద్ధి రేటు అభివృద్ధి ఎక్కువగా జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగవలసిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని బొత్స ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసు అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చంద్రబాబు(CM Chandrababu) ఎందుకు చెప్పలేక పోయారని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ పై బడ్జెట్ లో ఎందుకు మాట్లాడలేదు. రైతు భరోసా, అమ్మఒడి ఇవ్వలేదు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ముందే వైఎస్ జగన్(Former CM Jagan) చెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తుంది.. వైసీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. వైఎస్ జగన్ పాలనలో ఒప్పందం కుదుర్చుకున్నారు.. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అనేక సార్లు సంప్రదింపులు జరిపామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Next Story

Most Viewed