AP latest political news: కార్యకర్తలతో ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ భేటీ..

by Indraja |
AP latest political news: కార్యకర్తలతో ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ భేటీ..
X

దిశ వెబ్ డెస్క్: ఈ రోజు కార్యకర్తలు, అభిమానులతో నందికొట్కూరు వైసీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఖచితంగా తనకే ఇస్తానని చెప్పి.. ఇప్పుడు మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు కేఎస్‌ఆర్‌ పంక్షన్‌ హాలులో జరగనున్న సమావేశంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకుల ముందు తన భవిష్యత్ కార్యాచరణ పై స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.

తాజాగా వైసీపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో ఆర్థర్‌ పేరు లేదు. ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గ సిటింగ్‌ ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థర్ ను పక్కన పెట్టి ఆ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కడప జిల్లాకు చెందిన డాక్టర్‌ సుధీర్‌ను వైసీపీ అధిష్ఠానం నియమించింది. అయితే గతంలో వైసీపీ మూలస్తంభాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అలానే జిల్లా కో ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి ఇరువురు రానున్న ఎన్నికల్లో ఆర్థర్‌ కు సీటు ఇచ్చే పూచీ తమదని హామీ ఇచ్చారు.

అయితే ఐప్యాక్ సర్వే ఆధారంగా ఇంఛార్జులను నియమించిన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిక్కెట్ల విషయంలో ఎవరి మాట వినలేదు. ఈ నేపథ్యంలో ఆర్థర్‌ కు అధిష్టానం మొండి చెయ్యి చూపించింది. అయితే ఆర్థర్‌ మాత్రం తనకు ఐప్యాక్ సర్వే రిపోర్టు కూడా అనుకూలంగా వచ్చిన.. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఒకే ఇన్‌చార్జ్‌ పెత్తనం సాగుతోందని అందుకే అర్హత ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదని.. ప్రత్యక్షంగా విమర్శించక పోయిన పరోక్షంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై విమర్శలు గుప్పించారు అని విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement

Next Story

Most Viewed