శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రండి.. హీరో ప్రభాస్‌‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

by srinivas |   ( Updated:2025-02-16 11:27:35.0  )
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రండి.. హీరో ప్రభాస్‌‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు శ్రీకాళహస్తి(Srikalhasti)లో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు(Maha Sivarathri Brahmostavalu) జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తికి రావాలని హీరో ప్రభాస్‌ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(Mla Sudheer Reddy) ఆహ్వానించారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల ఉత్సవాలకు కూడా కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను ప్రభాస్‌కు వివరించారు.


కాగా ఫిబ్రవరి 21 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి ఆలయం ముస్తాబవుతోంది. ఈసారి ప్రముఖులను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలుస్తు్న్నారు. మహాశివరాత్రి బ్రహోత్సవాలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురిని కలిసి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.


మరోవైపు శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిందుకు అధికారులు, ఆలయ సిబ్బంది రెడీ అయ్యారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తారని అంచనావేస్తున్నారు. ఈ నెల 21నుంచి మార్చి 6 వరకూ కూడా రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చే అవకాశం ఉందని అంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఆదిదంపతులును దర్శించుకునేందుకు వీలుగా శ్రీకాళహస్తిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. అలాగే భక్తుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకమైన స్థలాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణోత్సవం రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌తో పాటు బస్టాండ్ల వద్దకూ ఉచిత బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed