- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఏపీలో మరో ఎన్నిక.. తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గురువారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఖాళీలు 7 కాగా బరిలో 8 మంది ఉన్నారు. వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒక అభ్యర్థి ఈ బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. కానీ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో మొత్తం టీడీపీ బలం 19గా ఉంది. అయితే వైసీపీకి దూరంగా ఉంటున్న కోటంరెడ్డి, ఆనం టీడీపీకి ఓటు వేసినా మరొకరి ఓటు అవసరం ఉంది. దీంతో ఎమ్మెల్యేలపై వైసీపీ అధినేత, సీఎం జగన్ నిఘా పెట్టారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. అటు టీడీపీ కూడా పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై విప్ జారీ చేసింది. తమ పార్టీకి తప్ప మరెవరికి ఓటు వేసినా చర్యలు తప్పని హెచ్చరించింది. దీంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
ఇక వైసీపీకి అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. జనసేన నుంచి గెలిచిన రాపాకతో పాటు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కలుపుకుంటే వైసీపీకి మొత్తం 156 మంది బలం ఉంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మినహాయిస్తే వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఏడు స్థానాల్లో గెలవాలంటే 154 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి.. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీకి గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక టీడీపీ నుంచి అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పంచుమర్తి అనురాధ నిలిచారు. అనురాధ గెలవాలంటే 22 ఓట్లు కావాలి.. బుధవారం అసెంబ్లీలోని మీటింగ్ హాలులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఓటింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ఉటుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
ఇవి కూడా చదవండి : Ugadi Panchangam: ఏపీకి కాబోయే సీఎం ఎవరు?