- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బీజేపీ పొత్తును విస్మరించిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
దిశ,ఉరవకొండ:ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బీజేపీ పొత్తును విస్మరించటం లో ఆ పార్టీ 5 మండలంలోని నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్న అనంతరం జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుని సీట్లు సర్దుబాటు చేసుకున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో తెలుగుదేశం కు సంబంధించిన కొంతమంది నాయకులు కొన్ని అసెంబ్లీలలో నేనంత నువ్వెంత అన్న చందంగా సీటు కోసం టీడీపీ పొత్తు కుదుర్చుకున్న, బీజేపీ కూటమి ని లెక్కచేయకుండా ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పొత్తు విషయాన్ని మరిచి బీజేపీ ఉరవకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల కుటుంబ సభ్యులను ఏ మాత్రం పలకరించిన పాపాన లేదు.పొత్తు విషయం అధిష్టానానికి మాత్రమే, నాకు మాత్రం అవసరం లేదు అన్న విధంగా వ్యవహారం ఉంది.
ఉరవకొండ అసెంబ్లీ ఐదు మండలాల్లో పనిచేస్తున్న బీజేపీ కుటుంబ సభ్యులు ఐదు సంవత్సరాలు నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, ఉన్నత నాయకులు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీ కార్యక్రమాలు చేయసాగారు. ఎన్డీఏ కుటుంబంలో ఎంతో మంది ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు మోర్చాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు బిజెపి అభిమానులు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలానే ఏకపక్షంగా వ్యవహరిస్తే రాబోయే 2024 ఎలక్షన్ లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలవడం అసాధ్యం అని వారు ఎద్దేవా చేశారు.ఇల్లు అలికితే పండుగ ఎలా అవుతుంది గుర్తుపెట్టుకోండి. పొత్తులు కుదుర్చుకున్న కనీస సీట్లకు పోటీ చేయనివ్వండి. ధర్మవరం టికెట్ కోసం ఓ తెలుగుదేశం కుటుంబం నివురుగప్పిన నిప్పులా ఏకంగా టికెట్ కోసం పెద్ద ఎత్తున ధర్మవరం పట్టణంలో భారీ నాయకులు కార్యకర్తలతో బీజేపీ నాయకులను విమర్శించే విధంగా ర్యాలీ నిర్వహించారు. ఇదేనా పొత్తుల వ్యవహారం బీజేపీ కార్యకర్తలు నాయకులు విమర్శిస్తున్నారు.
Read More..