ఆ శక్తి జగన్‌కు లేదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఆ శక్తి జగన్‌కు లేదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, అనకాపల్లి: సంఘటిత శక్తిని ఎదుర్కొనే శక్తి జగన్‌కు లేదని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో యువత జీవనోపాధికి కల్పించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. మూడు పార్టీల కలయిక ఒక అగ్ని విస్పోటనమని, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని చెప్పారు. ‘కూటమిని ఎదుర్కొనే శక్తి జగన్‌కు లేదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, హింసించడం దారుణం. రాక్షసుడు పరిపాలన అంతం చేయడం కోసమే అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు మన హక్కు, రైల్వే జోన్, కేంద్రం నుంచి నిధులు మంజూరు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి పంపేసి, చిన్నాన్నను చంపినోళ్లను రక్షిస్తున్నందుకా సిద్ధమా?. దళితులను చంపిన నిందితులను కాపాడుతున్నందుకు సిద్ధమా?, పోలవరం బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా.. అన్నింటితో పాటు చివరకు చెత్త మీద పన్ను మీద పన్ను వేసిన దానికి సిద్ధమా.. చీప్ లిక్కర్ అమ్మకం చేస్తూ, లక్షల మంది మహిళల తాలిబొట్లు తెంపేందుకు సిద్ధమా.’ అని బాలకృష్ణ ప్రశ్నించారు.

‘ఇక జగన్ ఆటలు ఆగవని, గుర్తుంచుకోవాలని బాలకృష్ణ హెచ్చరించారు. ఎన్నికల యుద్దం మొదలయ్యింది.. ప్రజా తీర్పు కోసం కాసుకో జగన్.. అంటూ సవాల్ విసిరారు. ప్రజల్ని వేధించిన పాపానికి భవిషత్తులో ఎలా ఇబ్బంది పడతావో చూసుకో జగన్ అంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలంతా ఓటు పోటు ఎలా పోటు పోడుస్తారో తేల్చుకో.. అంటూ సవాల్ విసిరారు. అభివృద్ధి కవాలా?, విధ్వంసం కావాలా? సమర్దవంతమైన పాలన కావాలా?, లేక రాక్షస పాలన కావాలా? అంటూ ప్రజలే తేల్చుకోని, ఓటు వేయాలని కోరారు. ఇక్కడ విప్‌గా ఉన్న అధర్మశ్రీ అన్నింటికీ పన్నులు వసూలు చేస్తున్నారు.. అన్నింటిలో కమీషన్లు వసూలు చేసి, అదికారం చెలాయిస్తున్నారన్నారు. బీఎన్ రోడ్డు పనులు మధ్యస్థంలోనే నిలిచిపోయేలా కమీషన్లు పెంచి, కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేశారన్నారు. జగన్ గుర్తు పెట్టుకో.. దేశమంటే మట్టికాదు. దేశమంటే మనుషులోయ్ అంటూ హెచ్చరించారు. ఇద్దరు మంత్రులు, ఒక విప్ ఉండి, చోడవరం చెరకు ఫ్యాక్టరీని పునరుద్ధరించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఓటును అంత తేలిగ్గా తీసుకోవద్దు.. అంతా రాక్షస పాలన కోసం అంతా కలిసి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి, ఉద్యమాలు చేసిన ఘనత ఆయనకే చెందుతుందని బాలకృష్ణ పేర్కొన్నారు.

Next Story

Most Viewed