- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను బెదిరిస్తే.. మీకు వీడియో కాల్స్ వస్తాయ్: MLA కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: బూరగడ్డ అనిల్ అనే వ్యక్తిని కిడ్నాప్, బెదిరింపులకు పాల్పడ్డట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యవహారంపై కోటం రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసే కాదు.. కావాలంటే మర్డర్ కేసు పెట్టుకోండంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఫోన్లు చేసి బెదిరిస్తే.. మీకు వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరించారు. వైసీపీ నుండి తాను సైలెంట్‌గా వెళ్లిపోవాలని అనుకున్నానని.. కానీ తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుంనందుకే వారికి సమాధానం ఇస్తున్నానని చెప్పారు.
తాను వైఎస్ వీరవిధేయుడిని కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ ఆరోపిస్తున్నారు.. కానీ కాకాణి ఆనంను ఏ విధంగా క్షోభ పెట్టారో జిల్లా మొత్తం తెలుసని విమర్శించారు. వైఎస్‌కు వీరవిధేయుడినని చెబుతోన్న కాకాణి.. ఆరోజు వైఎస్ విగ్రహం ఎందుకు పెట్టించలేదని ప్రశ్నించారు. జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని అప్పట్లో మంత్రి కాకాణి గోవర్ధన్ చెప్పలేదా అని నిలదీశారు. తాను ఎక్కడుంటే అక్కడ వీరవిధేయుడిగానే ఉంటానని తెలిపారు. కోటంరెడ్డి అరెస్ట్ రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండని.. తన సంగతి పక్కన పెట్టి.. ముందు నెల్లూరుకు వచ్చిన సీబీఐ సంగతి చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
READ MORE