- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం.. ఎమ్మెల్యే జూలకంటి కీలక వ్యాఖ్యలు
దిశ,కారంపూడి: కారంపూడి పట్టణ పరిధిలో ఉన్న బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ పాఠశాలలో 68వ ఏపీ ఎస్ జి ఎఫ్ ఇంటర్ డిస్టిక్ ఖో ఖో పోటీలను శనివారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి రిబ్బన్ కట్ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దారుడ్యాన్ని పెంచుతాయి, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడల మీద ప్రత్యేకమైన చర్చ కూడా జరిగిందన్నారు. గతంలోనే టీడీపీ పార్టీ మండలానికి ఒక మినీ స్టేడియన్ని ఏర్పాటు చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి కొంతమేర పని జరిగినప్పటికీ, అన్ని నియోజకవర్గాల్లో మరి ఆ విధంగా అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియంలు ఏర్పాటు చేయలేదని, ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పేసి కూడా నిన్న మాట్లాడటం జరిగింది అని తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ముఖ్యంగా క్రీడాకారులకు తెలియజేస్తాను.. లోకేష్ బాబు విద్యాశాఖను తీసుకున్నప్పుడు మేము అందరం కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి లోనయ్యామని ఆయన విద్యాశాఖను తీసుకోవడం వెనుక మరి ఆంతర్యం క్రమంగా అర్థమవుతూ వస్తుందన్నారు. దేశానికి వెన్నెముక యువత అటువంటి యువతని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఈ దేశానికి ఉత్తమ పౌరులను ఎలా అందించాలి, అలాగే విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావాలి, అన్ని విభాగాల్లో కూడా మరి అప్ప్రెటేషన్ జరగాలి అనే ఆలోచనతో నిజంగా విద్యాశాఖను నిర్వహించడం అనేది ఒక క్లిష్టమైన బాధ్యత, బాధ్యతలను చేపట్టిన విద్యాశాఖలో మనం ఏం చేయాలి ఉన్న లోకాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అని చెప్పి ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యాశాఖ దేశంలో నిలబడాలన్నా ఆయన ఆకాంక్ష ఫలించాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వహకులకు మరోసారి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంగులూరి పుల్లయ్య, పంగులూరి అంజయ్య, బోల్నేడి శ్రీను, ఉన్నం లక్ష్మీనారాయణ, కారంపూడి సర్పంచ్ సరస్వతి భాయ్ బాలు నాయక్, చప్పిడి రాము, జనసేన పార్టీ సమన్వయకర్త బుసా రామాంజనేయులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శెట్టి హనుమంతరావు, కర్ణ సైదారావు, గోళ్ళ సురేష్ యాదవ్, ఎంఈఓ 1 శ్రీనివాసరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ బాలు నాయక్, అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ మోదిన్స,ఇంచార్జ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘుబాబు, కటికల బాలకృష్ణ, తండం మస్తాన్ జానీ, ఎస్పిఆర్ కృష్ణ, శంకర్, తదితర ఎన్డీయే కూటమి నాయకులు, అన్ని జిల్లాల పీటీలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.