- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రామ జోగిపేట భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే చేయూత..
X
దిశ, ఉత్తరాంధ్ర: రామ జోగిపేట భవనం కూలిన ఘటనలో మృత దేహాలకు పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. అంత్యక్రియల ఖర్చులు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున బాధితులకు అందజేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున అందజేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు వైఎస్సార్ బీమా తరపున ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఘటనలో గాయపడిన రామారావు కళ్యాణి దంపతులకు సొంత ఇంటిని మంజూరు చేస్తున్నామని తెలిపారు. రామారావు కుటుంబం సొంత ఇంట్లో చేరేవరకు వారి ఇంటి అద్దెను స్వయంగా భరిస్తానని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారు దాదాపుగా కోలుకుంటున్నారని కేజిహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు.
Advertisement
Next Story