పవన్ కల్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నాపై పోటీ చేయ్: ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:10 Oct 2023 3:40 PM  )
పవన్ కల్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే నాపై పోటీ చేయ్: ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఆంధ్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. కాకినాడలో వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. యాత్రలో భాగంగా కాకినాడలో పర్యటించిన పవన్ స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. అయితే, పవన్ కల్యాణ్‌కు దీటుగా ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇవాళ ఎమ్మెల్యే ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాళ్లంతా ఇప్పుడు నీతో ఉన్నారా అని నిలదీశారు. తాను రెండు సార్లు పోటీ చేసి గెలిచానని.. నువ్వు రెండు చోట్ల ఓడిపోయావని.. తనను విమర్శించే స్థాయి నీకు లేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఆరోపించినట్లు తాను రౌడీని అయితే జనం తనను రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.

తనను ఓడిస్తానని శపథం చేసిన పవన్ కల్యాణ్‌కు ఒక్కటే చెబుతున్న.. నన్ను ఓడించడం నీ వల్ల కానే కాదు అని అన్నారు. పవన్ కల్యాణ్ నన్ను ఓడిస్తానని చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే పవన్ కాకినాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్‌ను చిత్తుచిత్తుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖర్ రెడ్డినే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై పవన్ కల్యాణ్ గెలిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని.. ఓడిపోతే పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి తప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. కాకినాడ నుండి వెళ్లే లోపు పవన్ కల్యాణ్ తన ఛాలెంజ్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.

పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని అందరికి తెలసని అన్నారు. నువ్వు ఆరోపించినట్లుగా నా దగ్గర రూ.1500 కోట్లు ఉంటే ప్యాకేజీ ఇచ్చి నిన్నే కొనేవాడినని సెటైర్ వేశారు. తనపై ఇష్టం వచ్చినట్లు పవన్ మాట్లాడుతున్నాడని.. అసలు నేను తలచుకుంటే కాకినాడలో నీ బ్యానర్లు కూడా ఉండేవి కావని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను తరిమేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 14న సీఎం కాలేనని.. ఇప్పుడేమో సీఎం చేయండని మాట మారుస్తావా అని ఫైర్ అయ్యారు. చంద్రబాబుతో ప్యాకేజీ బేరం కుదరకే వారాహి యాత్రతో రోడ్డు మీదకు వచ్చావని ఆరోపించారు. నీ కంటే నాది పెద్ద నాలుక అని.. మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed