నా భర్తపై కుట్ర జరుగుతోంది: ఎమ్మెల్యే ఆదిమూలం భార్య

by srinivas |   ( Updated:2024-09-05 10:31:05.0  )
నా భర్తపై కుట్ర జరుగుతోంది: ఎమ్మెల్యే ఆదిమూలం భార్య
X

దిశ, వెబ్ డెస్క్: మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలతో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం (Satayvedu Tdp Mla Adimulam) పార్టీ నుంచి సస్సెన్షన్ అయిన విషయం తెలిసిందే. అయితే తన భర్త ఆదిమూలంపై కుట్ర జరిగిందని ఆయన భార్య గోవిందమ్మ అన్నారు. తన భర్త చాలా మంచివాడని ఆమె తెలిపారు. ఇప్పటివరకూ ఆదిమూలంపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. ఆదిమూలం తప్పు చేయరని, నియోజకవర్గంలో ఆయన ఎలాంటి వారో అందరికి తెలుసన్నారు. రాజకీయంగా ఆయనపై కుట్ర జరుగుతోందని ఆదిమూలం భార్య గోవిందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. సత్యవేడు నారాయణవనంలోని ఆయన నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ భారీగా మోహరించారు. సొంత బంధువులను సైతం లోపలికి అనుమతించడంలేదు. ఎమ్మెల్యేను కలిసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించారని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఓ మహిళ మీడియాకు తెలిపారు. దీంతో ఆయనపై పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story