- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ తరిమేస్తాం..Pawanపై Roja తీవ్ర ఆగ్రహం
దిశ వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎవరి మీదో పవన్ కల్యాణ్‌కే స్పష్టత లేదని ఆమె విమర్శించారు. పవన్‌కు ఏపీ మీద కాదని, చంద్రబాబు మీదే ప్రేమ అని రోజా ఎద్దేవా చేశారు. రెండు చోట్ల ఓడిన పవన్ చూసి జగన్ భయపడతారా అని ప్రశ్నించారు. పవన్ వాహనం వారాహినో.. నారాహినో అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి, చిల్లర రాజకీయాలు చేసే వాళ్లను హైదరాబాద్ తరిమేస్తామని ఆమె హెచ్చరించారు.
యుద్ధానికి రెడీ అంటూ పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో యాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు. అయితే పవన్ వాహనంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేన, వైసీపీ నేతల మాటల మధ్య యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి రోజా కూడా విమర్శలు చేశారు.
తిరుపతి నగరంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, ఇండియా అండ్ అపెక్స్ బాడీ ఆఫ్ క్వాలిఫైడ్ ప్రొఫెషన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్'ఇంటిగ్రేటెడ్ సస్టైనబుల్ టూరిజం ప్లానర్స్'ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆర్‌కే రోజా పాల్గొన్నారు. వారాహి వాహనాన్ని పవన్ కల్యాణ్ అనుకూల మీడియానే హైలెట్ చేసిందని ఆమె ఎద్దేవా చేశారు. వారాహి వాహనంకు వేసిన రంగు చట్ట విరుద్ధమన్నారు. ఆర్మీ వాళ్ళు మాత్రమే ఆ రంగు వాహనాలను వాడాలన్న నిబంధన ఉందని అది పవన్ కల్యాణ్‌కు తెలియదా అని మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు.