వైకుంఠపురం DPR రూపొందిస్తున్నాం.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
వైకుంఠపురం DPR రూపొందిస్తున్నాం.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: వైకుంఠపురం బ్యారేజ్(Vaikuntapuram Barrage) పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2019, ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉండగా.. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రాజధాని అమరావతితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు నీటి అవసరాలు తీర్చే వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి కొత్త DPR తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి.. బ్యారేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

అలాగే.. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల(Minister Nimmala Ramanaidu) పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) కృషితోనే పోలవరానికి నేటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 5,052 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ నిధులతో డీ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. కేంద్రం తొలి, 2వ విడత అడ్వాన్సులుగా నిధులు విడుదల చేస్తోందని చెప్పారు.



Next Story

Most Viewed