ఏపీ రాజధానిపై మంత్రి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2025-03-06 16:08:13.0  )
ఏపీ రాజధానిపై మంత్రి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital) నిర్మాణంపై మంత్రి నారాయణ(Minister Narayana) మరోసారి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో అమరావతి(Amaravati)ని పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు రాజధానికి ప్రజల డబ్బు ఖర్చు చేయమని చెప్పారు. వివిధ రుణాల ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. రాజధాని భూమి విలువలతో రుణం తీర్చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిపై ప్రతిపక్షాలు చర్చిస్తామనడం హాస్యాస్పదమని మంత్రి నారాయణ విమర్శించారు.

కాగా ఏపీ రాజధాని నిర్మాణ పనులను త్వరలో చేపట్టనున్నారు. పలు నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి అయింది. ఇటీవల మరికొన్ని పనులకు కూడా టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ మరోసారి స్పష్టత ఇచ్చారు.

2014-19 సమయంలో అమరావతి నిర్మాణాలను ప్రారంభించారు. కొంత పనులు జరిగాయి. 2019లో ప్రభుత్వం మారడంతో మూడు రాజధానుల ముచ్చట తెరపైకి వచ్చింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా గత ఐదేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఏకైక రాజధానిపై ఆశలు కొనసాగాయి. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాజధాని ప్రాంతంలో మొలచిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించారు. నిర్మాణాలు ఏర్పాటు చేసే విధంగా అమరావతి ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అమరావతి నిర్మాణానికి అటు కేంద్రం సాయం అందిస్తుండటంతో త్వరలోనే పనులు ఊపందుకోనున్నాయి.

Next Story

Most Viewed