- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘తనకు లేని అధికారాన్ని జగన్ కోరుకుంటున్నారు’.. మంత్రి నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్స్

దిశ,వెబ్‌డెస్క్: ప్రతిపక్ష హోదా పై వైసీపీ నేతలు(YCP Leaders) కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి(Minister of Civil Supplies) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) విమర్శించారు. వైఎస్ జగన్(YS Jagan) తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గౌరవం ఇవ్వకుండా ఛీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారం పై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరఫున కోరుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పై సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ రోజు(బుధవారం) శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) మాట్లాడుతూ.. ప్రతిపక్ష సభ్యులు సభ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సభా హక్కులను విస్మరించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ, సభా హక్కుల కమిటీకి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని మంత్రి నాదెండ్ల సభాపతిని కోరారు. సభా హుందాతనాన్ని కాపాడే బాధ్యత సభ్యులందరి పైన ఉందని తెలిపారు.
ప్రతిపక్షం సభా నియమాలను దుర్వినియోగం చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. సభాపతి తీసుకున్న నిర్ణయం (రూలింగ్) పూర్తిగా సమంజసమైనది. సభా హక్కుల కమిటీ దీనిపై లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షం కూడా సహకరించాలని, లేకపోతే ప్రజలే వారిని తిరస్కరిస్తారని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక విధ్వంసం నుంచి బయటికి వచ్చి రాష్ట్రాన్ని మరోసారి అభివృద్ధి పథంలో నడిపించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలని మంత్రి సూచించారు.